
అమరావతి, 05 అక్టోబర్ (హి.స.) బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల కొన్ని రోజుల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు చేసింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఏపీతో సోమవారం వాతావరణం
ఇక ఏపీలోనూ తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ అంతర్గత కర్ణాటక, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కేరళ మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం, పై ద్రోణితో విలీనమైందని.. అలాగే దక్షిణ కోస్తా, పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడి.. యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయిని.. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తరు వర్షాలు
ఇక తెలంగాణలోని పలు జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని నల్గొండ, రంగారెడ్డి, నాగర్కర్నూల్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ రూరల్, యాదాద్రి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా. మరి కొన్ని ప్రాంతాల్లో పోడి వాతావరణ కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV