కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం
కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనుల్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.
కడపలో జల్ జీవన్ మిషన్ 2.0 ప్రారంభించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 3.27 కోట్ల మందికి ప్రయోజనం


పొద్దుటూరు, 05 అక్టోబర్ (హి.స.)గోదావరి, కృష్ణ నదులు అనుసంధానం చేసి జలహారతి ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

ఈ రోజు సోమవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘జలజీవన్ మిషన్2.0-అమరజీవి జలధార' కార్యక్రమాన్ని రాష్ట్రంలో లాంఛనంగా ప్రారంభించింది.

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే కార్యక్రమానికి కూటమి నేతలు శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ కడప జిల్లాకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రావడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో నూతనోత్సాహం కనిపించింది.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి నారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్థనరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నంద్యాల ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పోలవరాన్ని పూర్తిచేసి ప్రధాని మోదీతో దానిని ప్రారంభిస్తామన్నారు. గోదావరి-కావేరి నదులు అనుసంధానమైతే రాయలసీమలో కరవు ఉండదన్నారు. వచ్చే రెండేళ్లలో రూ.30వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు తాగునీరందిస్తామన్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా పల్లె పండుగ 3.0ను చేపట్టామన్నారు. మదనపల్లె హార్టికల్చర్ హబ్తో రాయలసీమ దశ-దిశ మారబోతోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. కర్మయోగి ద్వారా ప్రతి ఉద్యోగిలో నైపుణ్యం పెంచుతామని వెల్లడించారు. పాన్ IITద్వారా టెక్నాలజీని తదుపరి దశకు తీసుకెళ్తామని.. పాన్ IIT కౌన్సిల్ అమరావతిలో ఏర్పాటు కాబోతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande