
అమరావతి, 05 అక్టోబర్ (హి.స.)
సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైసీపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.ముస్లిం మైనార్టీ కుటుంబాలు భారీగా టీడీపీలో చేరాయి. సోమవారం స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ నేత కందికుంట దుర్గాప్రసాద్ సమక్షంలో ఆయా కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వందకు వంద శాతం స్థానాలను గెలిచి తీరుతామని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీలోని కొత్త, పాత వారందరికీ సముచితమైన స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ