శంషాబాద్ ఎయిర్పోర్టులో 800 గ్రాముల బంగారం సీజ్..
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఈ బంగారాన్ని పట్టుకున్నారు.
Airport


హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.) రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో అధికారులు భారీగా బంగారాన్ని సీజ్ చేశారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఈ బంగారాన్ని పట్టుకున్నారు.

ఇవాళ (సోమవారం) అనుమానాస్పదంగా కనిపించిన ఓ ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అతని దగ్గర సుమారు 800 గ్రాముల బంగారం దొరికింది. పట్టుబడ్డ బంగారం విలువ దాదాపు రూ.1.20 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.ఓ వ్యక్తి అక్రమంగా బంగారాన్ని తీసుకుని శంషాబాద్ విమానాశ్రయానికి వస్తున్నాడన్న పక్కా సమాచారం మేరకు డీఆర్ఎ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.

తిరుచ్చిరాపల్లి నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని హైదరాబాద్కు చెందిన నగల వ్యాపారిగా గుర్తించారు. అతని లగేజీని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ముందుగా కస్టమ్స్ అధికారులు సాధారణ తనిఖీల్లోనే ఈ బంగారాన్ని గుర్తించారు. అనంతరం ప్రయాణికుడిని విచారణ కోసం డీఆర్ఎ అధికారులకు అదుపులోకి తీసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande