
హైదరాబాద్, 05 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) అధికారులు తమ విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగా ప్రముఖ నాయకుడు కోదండరెడ్డిని సిట్ అధికారులు సోమవారం విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై జరుగుతున్న విచారణలో కోదండరెడ్డి పేరు వెలుగులోకి రావడంతో అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు. దాదాపు 40 నిమిషాలకు పైగా సాగిన ఈ విచారణలో, ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అధికారుల బృందం ఆయన నుంచి పలు కీలక వివరాలను సేకరించింది.
ఈ సందర్భంగా కోదండరెడ్డి అందించిన సమాచారాన్ని అధికారులు అధికారికంగా స్టేట్మెంట్ రూపంలో రికార్డు చేశారు.కోదండరెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో మరికొందరు కీలక వ్యక్తులకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశముందని సిట్ వర్గాలు వెల్లడించాయి.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు