ఆలయంలో అద్భుతం....శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్రదక్షిణ
అద్భుత దృశ్యం!..శివలింగం చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేసిన దృశ్యం ఆకట్టుకుంది.
శివలింగం చుట్టూ మూడు నాగుపాముల ప్రదక్షిణ..


నెల్లూరు, 05 అక్టోబర్ (హి.స.)శివలింగం చుట్టూ నాగుపాములు ప్రదక్షిణలు చేసిన దృశ్యం ఆకట్టుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మనుబోలు బీసీ కాలనీ సమీపంలో రైల్వే గేట్ వద్దనున్న శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ఈ దృశ్యం ఆవిష్కృతమయింది.

ఈ రోజు సోమవారం ఉదయాన్నే మూడు నాగుపాములు శివలంగం చుట్టూ ప్రదక్షిణ చేశాయి. అనంతరం అవి సమీపంలో ఉన్న పుట్టలోకి వెళ్లిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న భక్తులు నాగుపాముల్ని చూసేందుకు అక్కడికి చేరుకున్నారు.

ఈ అరుదైన దృశ్యాన్ని కొందరు భక్తులు తమ ఫోన్లలో వీడియో తీయడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజే ఇలా మూడు నాగసర్పాలు కనిపించడం దైవ సంకేతంగా భక్తులు భావిస్తున్నారు.

కాగా.. గతంలో కూడా ఈ శివలింగం చుట్టూ నాగుపాములు ప్రదక్షిణ చేశాయి. వాటికవే వచ్చి శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం.. పైగా సోమవారం కూడా కావడంతో ఇది కచ్చితంగా దైవం చేస్తున్న పనే అని నమ్ముతున్నారు.గత ఏడాది మే 17న కూడా అభిషేకం తర్వాత శివలింగంపై ఓ నాగుపాము పడగవిప్పి దర్శనమిచ్చింది. అలాగే, గతేడాది అక్టోబర్లో నాగుల చవితి రోజున రెండు నాగుపాములు శివలింగం పక్కన కనిపించి భక్తులను ఆశ్చర్యపరిచాయి. తరచూ ఇలా నాగసర్పాలు దర్శనమివ్వడం ఆ క్షేత్ర మహత్యంగా స్థానికులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande