విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మంగళవారం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈవో శిరీష ఆధ్వర్యంలో వేద పండితులు వరుణ యాగం నిర్వహించారు.
విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో వరుణ యాగం

అమరావతి, 06 అక్టోబర్ (హి.స.)

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకుంటూ మంగళవారం విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈవో శిరీష ఆధ్వర్యంలో వేద పండితులు వరుణ యాగం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు యాగంలో పాల్గొని పూజలు చేశారు. వర్షాలు కురిస్తే పంటలు పండుతాయని.. రైతులపాటు ప్రజలందరూ సంతోషంగా ఉంటారని ఆమె చెప్పారు. ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఈ సమయంలో వర్షాలు కురిస్తే ప్రయోజనం ఉంటుందని ఆమె వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ

 rajesh pande