తెలంగాణలో విద్యుత్పై భారీ ఒత్తిడి.. 20 వేల మెగావాట్లకు చేరిన గరిష్ఠ డిమాండ్
డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
Electricity


హైదరాబాద్ , 06 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరగడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.

ప్రస్తుతం గరిష్ఠ డిమాండ్ దాదాపు 20 వేల మెగావాట్లకు చేరిందని తెలిపారు. గతంలో ఇదే సమయంలో గరిష్ఠ డిమాండ్ సుమారు 15 వేల మెగావాట్ల వద్ద ఉండేదని చెప్పారు. అంటే కొద్ది కాలంలోనే డిమాండ్ దాదాపు 5 వేల మెగావాట్ల మేర పెరిగింది.

మరోవైపు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, నదులు, జలాశయాల్లో నీటి లభ్యత తగ్గడం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తి కూడా దాదాపు 4 వేల మెగావాట్ల మేర తగ్గిందని ఆయన వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను నిరంతరంగా కొనసాగించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా పరిశ్రమలు, వ్యవసాయం, గృహ అవసరాలకు విద్యుత్ కొరత రాకుండా ఉత్పత్తి, కొనుగోలు, పంపిణీ వ్యవస్థలను సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాభావం కొనసాగితే రాబోయే కాలంలో జలవిద్యుత్ ఉత్పత్తి మరింత తగ్గే అవకాశం ఉండటంతో థర్మల్ విద్యుత్పై ఆధారపడాల్సిన అవసరం పెరుగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande