రాయలసీమలో రూ.లక్ష కోట్ల గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. ప్రైవేట్ పెట్టుబడులకు పిలుపు
రాయలసీమ ప్రాంతంలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికతో ఈ హబ్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.
Ap govt


అమరావతి , 06 అక్టోబర్ (హి.స.)రాయలసీమ ప్రాంతంలో సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడి ప్రణాళికతో ఈ హబ్ను అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది.

రాయలసీమలో వ్యవసాయానికి నీటి కొరత ఒక ప్రధాన సవాలు. అయినప్పటికీ తక్కువ నీటితో సాగు చేయగల ఉద్యాన పంటలు, పండ్లు, కూరగాయలు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, కోల్డ్చెయిన్, ఎగుమతుల రంగాలకు ఈ ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. పంట ఉత్పత్తిని మాత్రమే కాకుండా ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, ఎగుమతుల వరకు పూర్తి విలువ గొలుసును ఏర్పాటు చేయడం హబ్ లక్ష్యంగా ఉండనుంది.

రైతులకు మార్కెట్ ధరలపై మెరుగైన సమాచారం అందించడం, పంటల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం, కోల్డ్ స్టోరేజీ సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలు అవసరం. ప్రైవేట్ పెట్టుబడులు ఈ రంగంలోకి వస్తే ప్రాసెసింగ్ యూనిట్లు, ప్యాకేజింగ్ కేంద్రాలు, లాజిస్టిక్స్ సదుపాయాలు, ఎగుమతి కేంద్రాలు ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande