
అమరావతి, 08 అక్టోబర్ (హి.స.)
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ సంస్థలకు దీటుగా తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కృషి చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (వీపీఆర్) ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.8 కోట్లకు పైగా నిధులతో ఆధునికీకరించిన నెల్లూరు నగరంలోని ఆర్ఎస్ఆర్ ప్రభుత్వ పాఠశాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణతో కలిసి ఆమె గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన అనంతరం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీతో నిర్వహించిన ఆత్మీయ సదస్సులో మాట్లాడారు. మంత్రి నారాయణ నేతృత్వంలో నెల్లూరు రూరల్, అర్బన్ పరిధిలో 24 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ