
హైదరాబాద్ , 08 అక్టోబర్ (హి.స.)భారత్లో స్టార్లింక్ ప్రవేశాన్ని కొందరు ‘ఒలిగార్కులు’ అడ్డుకుంటున్నారని మస్క్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆ వ్యక్తుల పేర్లను వెల్లడించాలని కేటీఆర్ కోరారు.
మస్క్ సోషల్ మీడియా వేదికగా భారత్లో స్టార్లింక్ సేవలకు అనుమతుల ప్రక్రియను కొందరు తమ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. భారత్లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలకు సంబంధించిన నియంత్రణ వ్యవస్థ పారదర్శకంగా, వివక్ష లేకుండా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. స్టార్లింక్ సహా మూడు సంస్థలు ప్రస్తుతం భద్రతా పరిశీలన ప్రక్రియలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ మస్క్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, భారత్లో ఎవరెవరు స్టార్లింక్ను అడ్డుకుంటున్నారో పేర్లు బయటపెట్టాలని కోరారు. ప్రజలకు అసలు విషయం తెలియాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్