కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం...... ఒకరు మృతి
కృష్ణా జిల్లా పామర్రు మండలం మలయప్పన్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
Accident


అమరావతి, 08 అక్టోబర్ (హి.స.)

కృష్ణా జిల్లా పామర్రు మండలం మలయప్పన్ పేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్తున్న రెండు కార్లు, బైక్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడు విజయవాడకు చెందిన న్యాయవాది దాసరి అజయ్కుమార్గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande