
అమరావతి, 08 అక్టోబర్ (హి.స.)
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, గోపాలపురం, పోలవరం మండలాల్లోపెద్దపులి సంచరిస్తోంది. దేవరపల్లి మండలం గౌరీపట్నం నిర్మలగిరి మేరీమాత ఆలయం వెనక ఉన్న క్వారీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా అధికారులు పెద్దపులి కదలికలను గుర్తించారు.
సమీప క్వారీ కార్మికులను పనులకు వెళ్లవద్దని అప్రమత్తం చేశారు. టైగర్ రిజర్వ్ బృందాలతో అటవీశాఖ అధికారులు సుమారు 30 మంది పెద్ద పులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ