విదేశీ యూనివర్సిటీలకు ఏపీలో తలుపులు.. ప్రైవేట్ స్కూళ్ల ఏర్పాటులోనూ నిబంధనల సడలింపు
ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కీలక మార్పులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు రాష్ట్రంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకునేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది.
University


అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో కీలక మార్పులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ప్రైవేట్ యూనివర్సిటీలు రాష్ట్రంలో క్యాంపస్లు ఏర్పాటు చేసుకునేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. Andhra Pradesh Policy for Promotion of Foreign Higher Educational Institutions and Private Universities, 2026 పేరుతో రూపొందించిన ఈ విధానం ద్వారా అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలను రాష్ట్రానికి ఆకర్షించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.

విదేశీ విశ్వవిద్యాలయాలకు రాష్ట్రంలో క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు అర్హతలు, ప్రోత్సాహకాలు, ప్రభుత్వ సహకారం వంటి అంశాలను కొత్త విధానం నిర్దేశిస్తుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరాన్ని కొంతవరకు తగ్గించడంతో పాటు రాష్ట్రంలోనే ప్రపంచస్థాయి కోర్సులు అందుబాటులోకి తీసుకురావడం ఈ విధానం ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది.

అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన కొన్ని నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించింది. పాఠశాల ఏర్పాటు లేదా రిజిస్ట్రేషన్కు ముందు నిర్దిష్ట ప్రాంతంలో సర్వే నిర్వహించడం, నోటిఫికేషన్ ఇవ్వడం, అక్కడ పాఠశాల అవసరం ఉందని నిర్ధారించడం వంటి కొన్ని విధానపరమైన దశలను తొలగించేలా AP Education Act, 1982లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే భద్రత, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, విద్యా ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande