ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి..... హనుమకొండ జిల్లా కలెక్టర్
రహదారుల వెంట ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు.
Collector


వరంగల్, 08 అక్టోబర్ (హి.స.)

రహదారుల వెంట ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు.

కమిషనర్ టి. వెంకన్నతో కలిసి కల్లుమండువా జంక్షన్, చింతగట్టు, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండో గేట్ తదితర ప్రాంతాల్లో గురువారం ఆమె పర్యటించి రహదారులు, ట్రాఫిక్, ఆక్రమణలు, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు.

రహదారుల వెంట ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగించే బిల్బోర్డులు, ఫ్లెక్సీలు, డబ్బాలు తదితర ఆక్రమణలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రహదారులపై నిత్యం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి సురక్షితమైన రాకపోకలకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande