
కామారెడ్డి, 08 అక్టోబర్ (హి.స.)
వయోవృద్ధుల అనుభవం, జ్ఞానం సమాజానికి ఎంతో విలువైనదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ నడక, యోగా చేయడంతో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు. వృద్ధుల సంక్షేమం కోసం అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..