
మెదక్, 08 అక్టోబర్ (హి.స.)
వార్షిక ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లాలోని శివంపేట పోలీస్ స్టేషన్ను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సందర్శించి విస్తృత తనిఖీలు చేపట్టారు. స్టేషన్ పరిపాలన వ్యవహారాలు, రికార్డుల నిర్వహణ, శాంతిభద్రతల పరిరక్షణ తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
కేసు డైరీలు రిజిస్టర్లు స్టేషన్లోని క్రైమ్ రికార్డులు,జనరల్ డైరీ ఎన్ఐఆర్ కాపీలు, ముద్దాయిల రిమాండ్ ఫైళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్లు మరియు సీసీ నంబర్లు రాని కేసుల పై ఎస్సై మధుకర్ రెడ్డి నీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన దర్యాప్తుతో ఫైళ్లను త్వరగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. స్టేషన్ సిబ్బంది విధి నిర్వహణ, వర్టికల్స్ అమలు, రిసెప్షన్ నిర్వహణ పై సంతృప్తి వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..