రిజర్వాయర్ పనులను పరిశీలించిన నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్
నక్కలగండి రిజర్వాయర్ పనులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి గురువారం పరిశీలించారు.
Collector


నాగర్ కర్నూల్, 08 అక్టోబర్ (హి.స.)

అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న ఎస్ఎల్బీసీ అవుట్లెట్ టన్నెల్, నక్కలగండి రిజర్వాయర్ పనులను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, సబ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి గురువారం పరిశీలించారు. మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్లెట్ టన్నెల్ పనులను పరిశీలించిన వారు.. పనుల పురోగతిపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నక్కలగండి రిజర్వాయర్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, ముంపు ప్రాంతాలు, భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం, పరిహారం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande