ప్రజా సమస్యల ఫిర్యాదుకై ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్.. కలెక్టర్ భవేష్ మిశ్రా
ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.
Collector

నిర్మల్, 08 అక్టోబర్ (హి.స.)

ప్రజల సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రీవెన్స్ సెల్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.

ప్రజలు తమ ఫిర్యాదులు, వినతులు ఇవ్వడానికి ప్రతి సోమవారం కలెక్టరేట్ కు రావాల్సిన అవసరం లేదని, ఇంటి వద్ద నుంచి తమ సమస్యలను వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు .

జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు, సమస్యలను 8317557897 నంబరుకు పూర్తి ఆధారాలతో వాట్సాప్ చేయాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రత్యేక బృందం ఆన్లైన్లో నమోదు చేసి వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు

 rajesh pande