పండగ సీజన్ వేళ .. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే శాఖ
రానున్న దసరా, దీపావళి పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Trains


హైదరాబాద్, 08 అక్టోబర్ (హి.స.)

రానున్న దసరా, దీపావళి పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.అక్టోబర్ 6, 13, 20, 27 తేదీలతో పాటు, నవంబర్ 3, 10, 17, 24 తేదీలలో ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.

అదేవిధంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం రేపు సికింద్రాబాద్, కాకినాడ మధ్య ప్రత్యేక రైలు రాకపోకలు సాగించనుంది. విశాఖపట్నం - బెంగళూరు మధ్య నడిచే వీక్లీ ఎక్స్ప్రెస్ సర్వీసును నవంబర్ 25 వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇక నర్సాపూర్ - తిరువణ్ణామలై ఎక్స్ప్రెస్ సర్వీసును నవంబర్ 30 వరకు కొనసాగించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande