
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)తిరుపతిలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన తాజా రాజకీయ ప్రకటనలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. త్వరలో కొత్త రాజకీయ పార్టీ లేదా రాజకీయ వేదికను ప్రకటించనున్నట్లు ఆయన మరోసారి సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం ప్రాంతాల్లో పలు ప్రతిపాదనలు వెల్లడించామని, ఇప్పుడు తిరుపతి వేదికగా మరో ఐదు ప్రతిపాదనలు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తిరుపతిలో ఆయన చేసిన వ్యాఖ్యల్లో టీటీడీ, హిందూ ధర్మం, సామాజిక సమానత్వం వంటి అంశాలకు ప్రాధాన్యం కనిపించింది. తన కొత్త రాజకీయ వేదిక అన్ని కులాలు, మతాలను కలుపుకుని ముందుకు సాగుతుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అధికార కూటమి, ప్రధాన ప్రతిపక్షం రెండింటిపైనా నిర్మాణాత్మక విమర్శలు చేస్తూ ప్రజల తరఫున పనిచేస్తామని ఆయన చెప్పారు.
తిరుమల లడ్డూ, నెయ్యి కొనుగోళ్ల అంశంపై కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చేసిన ఆరోపణలు, అనంతరం వచ్చిన విచారణ ఫలితాలపై ఆయన స్పందించారు. ప్రస్తుతం టీటీడీ నెయ్యి కొనుగోళ్ల ధరలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్