యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బొగ్గు వివాదం.. బీఆర్ఎస్పై భట్టి విమర్శలు
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.
Batti Vijramarka


హైదరాబాద్ , 08 అక్టోబర్ (హి.స.)యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు బొగ్గు సరఫరా విషయంలో తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క యాదాద్రి పవర్ ప్లాంట్ బొగ్గు సమస్యకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. గత ప్రభుత్వం అందుబాటులో లేని నాణ్యత కలిగిన బొగ్గును సరఫరా చేస్తామని ఒప్పందాలు చేసిందని ఆయన విమర్శించారు.

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్కు G9 ప్రీమియం గ్రేడ్ బొగ్గును భారీ స్థాయిలో సరఫరా చేస్తామని గత ప్రభుత్వం ఒప్పందం చేసిందని భట్టి పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ఆ స్థాయి బొగ్గు అందుబాటులో లేకపోవడంతో సమస్య తలెత్తిందని ఆయన వివరించారు. శాశ్వత పరిష్కారం చూపకుండా గతంలో ఒప్పందాలను పలుమార్లు మార్చడం ద్వారా సమస్యను వాయిదా వేశారని ఆయన ఆరోపించారు.

తెలంగాణలో విద్యుత్ రంగం గత కొన్నేళ్లుగా రాజకీయంగా కీలక అంశంగా ఉంది. వ్యవసాయం, పరిశ్రమలు, గృహ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande