ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
దేశ రాజధాని ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు.
CABINET


ఢిల్లీ , 11 నవంబర్ (హి.స.)

దేశ రాజధాని ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. దేశంలో ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో పాటు వివిధ కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల అమలు, దేశ ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అలాగే పలు శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కొత్త పథకాలకు ఆమోదం, ఇప్పటికే అమలులో ఉన్న కార్యక్రమాలకు నిధుల కేటాయింపు వంటి అంశాలపైనా నిర్ణయాలు వెలువడవచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఈ సమావేశంలో ఏయే అంశాలు ప్రధానంగా చర్చకు వస్తాయి? ఎలాంటి కీలక నిర్ణయాలకు ఆమోదం లభిస్తుంది? అనే విషయాలపై ఆసక్తి నెలకొంది. సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande