కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: ఎరువుల సబ్సిడీకి రూ. 62,370 కోట్లు.. మ్యూజియం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: ఎరువుల సబ్సిడీకి రూ. 62,370 కోట్లు.. మ్యూజియం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
modi


హైదరాబాద్, 11 నవంబర్ (హి.స.)

ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దేశాభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాబోయే రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్ఫేట్ మరియు పొటాషియం ఎరువుల సబ్సిడీ కోసం ప్రభుత్వం రూ. 62,370 కోట్లను కేటాయించింది. దీనివల్ల రైతులకు తక్కువ ధరకే ఎరువులు లభించనున్నాయి. అలాగే దేశ గొప్ప చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన 'యుగే యుగేన్ భారత్' మ్యూజియం ఏర్పాటుకు రూ. 3,230 కోట్లను కేటాయిస్తూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవే కాకుండా చిన్న సంస్థలకు రుణాల మద్దతు, అలాగే రవాణా వ్యవస్థను మెరుగుపరచడం వంటి వివిధ అభివృద్ధి ప్రణాళికలకు కూడా కేంద్రం నిర్ణయాలు తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande