కేదార్నాథ్ ఆలయం మూసివేత..
సాంప్రదాయ ధార్మిక పూజల మధ్య ఉదయం 8.30 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు.
Kedarnath


కేదార్నాథ్, 11 నవంబర్ (హి.స.)

టన్నుల కొద్దీ రంగురంగుల పూలతో ముస్తాబైన కేదార్నాథ్ ధామ్ ప్రాంగణంలో బుధవారం ఉదయం భక్తుల జయజయధ్వనాలు మిన్నంటాయి. వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా చూస్తుండగా, వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ ధార్మిక పూజల మధ్య ఉదయం 8.30 గంటలకు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మూసివేశారు. భాయి దూజ్ పర్వదినం సందర్భంగా జరిగిన ఈ ముగింపు ఉత్సవాలతో ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు తెరపడినట్లయింది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో భక్తులు తరలిరావడం విశేషంగా నిలిచింది. ద్వారాలు మూసిన తర్వాత బాబా కేదార్నాథ్ పవిత్ర చల్ విగ్రహ ఉత్సవ డోలీ శీతాకాల విడిది కోసం బయలుదేరింది. రాబోయే 6 నెలల పాటు ఉఖీమఠ్ లోని శ్రీ ఓంకారేశ్వర్ ఆలయంలోనే బాబాకు నిత్య పూజలు, దర్శనాలు కొనసాగుతాయి. శీతాకాలంలో హిమపాతం కారణంగా కేదార్నాథ్ వద్ద వాతావరణం అత్యంత శీతలంగా మారడం వల్లే ప్రతి ఏడాది ఇలా ఆలయాన్ని మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని ఉఖీమఠ్ కు తరలించడం ఆనవాయితీగా వస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande