ఐఎన్ఎస్ బెత్వా రీ-పవరింగ్ కోసం రూ. 500 కోట్ల ఒప్పందం చేసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎన్ఎస్ బెత్వా రీ-పవరింగ్ కోసం రూ. 500 కోట్ల ఒప్పందం చేసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ
ఐఎన్ఎస్ బెత్వా రీ-పవరింగ్ కోసం రూ. 500 కోట్ల ఒప్పందం చేసుకున్న రక్షణ మంత్రిత్వ శాఖ


న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)

భారత రక్షణ మంత్రిత్వ శాఖ నవంబర్ 11న న్యూఢిల్లీలో కొచిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL)తో రూ.498.58 కోట్ల విలువైన అత్యంత కీలకమైన ఒప్పందంపై సంతకం చేసింది.రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ అధికారిక ఒప్పందం కుదిరింది.భారత నౌకాదళంలో గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్‌గా సేవలు అందిస్తున్న బ్రహ్మపుత్ర క్లాస్ వార్‌షిప్ 'ఐఎన్‌ఎస్ బెత్వా' (INS Betwa) సమగ్ర పునరుద్ధరణ, ఇంజిన్ వ్యవస్థ మార్పు మరియు ఆయుధ సంపత్తి ఆధునీకరణ కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నారు.

ఈ ఒప్పందం కింద ఐఎన్‌ఎస్ బెత్వా యుద్ధనౌకలో ఉన్న పాత స్టీమ్ ఆధారిత ప్రొపల్షన్ వ్యవస్థను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో అత్యంత శక్తివంతమైన డీజిల్ ఇంజిన్ ఆధారిత డ్రైవింగ్ సిస్టమ్‌ను అమర్చనున్నారు.దీనితో పాటు యుద్ధనౌకలోని రక్షణ ఆయుధ వ్యవస్థలను, కాంబాట్ కెపాసిటీలను మెరుగుపరచడం ద్వారా సముద్రంలో నౌక యొక్క సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతారు.3,600 టన్నుల బరువు, 125 మీటర్ల పొడవు ఉన్న ఈ యుద్ధనౌక నౌకాదళానికి ప్రధాన వ్యూహాత్మక ఆస్తిగా పనిచేస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా భారతీయ నౌకా నిర్మాణ రంగంతో పాటు, సుమారు 50కి పైగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) భాగస్వామ్యం లభించనుంది.దీని ద్వారా స్థానికంగా అనుబంధ పరిశ్రమలలో విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఆత్మనిర్భర్ భారత్' మరియు 'మేక్ ఇన్ ఇండియా' విజన్‌కు అనుగుణంగా...దేశీయంగా యుద్ధనౌకల మరమ్మతులు, ఇంజిన్ పునరుద్ధరణ వంటి సంక్లిష్టమైన సాంకేతిక సవాళ్లను అధిగమించడంలో స్వదేశీ సామర్థ్యాన్ని చాటిచెప్పడానికి ఈ ఒప్పందం ఒక నిదర్శనమని కేంద్రం పేర్కొంది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande