అలైడ్ హెల్త్కేర్ నిపుణుల కోసం నూతన రిజిస్ట్రేషన్ నియమావళిని ప్రతిపాదించిన NCAHP
అలైడ్ హెల్త్కేర్ నిపుణుల కోసం నూతన రిజిస్ట్రేషన్ నియమావళిని ప్రతిపాదించిన NCAHP
అలైడ్ హెల్త్కేర్ నిపుణుల కోసం నూతన రిజిస్ట్రేషన్ నియమావళిని ప్రతిపాదించిన NCAHP


న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)

నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ (NCAHP) నవంబర్ 11న దేశవ్యాప్తంగా ఉన్న అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ (పారామెడిక్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, థెరపిస్టులు, రేడియోలాజిస్టులు తదితరులు) ప్రావిజనల్ రిజిస్ట్రేషన్ కోసం ఒక నూతన ఏకీకృత నిబంధనల డ్రాఫ్ట్‌ను ప్రతిపాదించింది.నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్‌కేర్ ప్రొఫెషన్స్ యాక్ట్, 2021 కింద తీసుకొచ్చిన ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్ ద్వారా దేశంలోని లక్షలాది మంది హెల్త్‌కేర్ వర్కర్ల అర్హతలకు చట్టబద్ధమైన గుర్తింపు దక్కనుంది.

ఈ ప్రతిపాదిత నిబంధనలలో భాగంగా, ప్రొఫెషనల్స్ తమ విద్యార్హతలను, నైపుణ్యాలను ఆన్‌లైన్ ద్వారా సరిచూసుకుని నమోదు చేసుకునేందుకు ఒక డిజిటల్ సిస్టమ్‌ను ప్రవేశపెడుతున్నారు.ప్రావిజనల్ రిజిస్ట్రేషన్ పొందిన ప్రతి హెల్త్‌కేర్ ప్రొఫెషనల్‌కు ప్రోవిజనల్ రిజిస్ట్రేషన్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (PR UID) కేటాయిస్తారు.దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపించి ఉన్న హెల్త్‌కేర్ రంగాన్ని డిజిటలైజ్ చేయడం, నకిలీ సర్టిఫికెట్లను అరికట్టడం మరియు అత్యంత పారదర్శకమైన రికార్డులను నిర్వహించడం సాధ్యమవుతుంది.

ఈ నూతన విధానం కింద రిజిస్ట్రేషన్ పొందిన నిపుణులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడానికి బ్రిడ్జ్ కోర్సులు, ఆచరణాత్మక క్లినికల్ శిక్షణ, అర్హత పరీక్షలు రాసేందుకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తున్నారు.దీని ద్వారా హెల్త్‌కేర్ సిబ్బంది అర్హతలు పెరగడమే కాకుండా, రోగులకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ ప్రతిపాదిత నిబంధనలపై డిసెంబర్ 4, 2026 వరకు నిపుణులు, విద్యాసంస్థలు మరియు సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను ఆహ్వానిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande