జాతీయ విద్యా దినోత్సవం 2026: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలకు దేశవాసుల నివాళులు
జాతీయ విద్యా దినోత్సవం 2026: మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలకు దేశవాసుల నివాళులు
మౌలానా


న్యూఢిల్లీ, 11 నవంబర్ (హి.స.)

భారతదేశ స్వతంత్ర పోరాట యోధుడు, దేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.1888 నవంబర్ 11న జన్మించిన ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలలో పలు ప్రత్యేక కార్యక్రమాలు, ఉపన్యాసాలు మరియు వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతదేశంలో విద్యా వ్యవస్థను పునర్నిర్మించడంలోనూ, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని పేద విద్యార్థులకు ప్రాథమిక విద్యను అందుబాటులోకి తీసుకురావడంలోనూ ఆయన వేసిన పునాదులను ఈ సందర్భంగా ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.

మానవ వనరుల వికాసానికి విద్యే మూలస్తంభమని నమ్మిన అబుల్ కలాం ఆజాద్, దేశంలో సాంకేతిక మరియు ఉన్నత విద్యాసంస్థల స్థాపనకు విశేష కృషి చేశారు. నేడు దేశ గర్వకారణంగా నిలిచిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) వంటి అత్యున్నత సంస్థల ఆవిర్భావంలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనది. అక్షరాస్యత శాతాన్ని పెంచడం మాత్రమే కాకుండా, విద్యార్థులలో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని, నైతిక విలువలను పెంపొందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని ఆయన పిలుపునిచ్చేవారు.

ఈ ఏడాది జాతీయ విద్యా దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం (NEP) అమలు పురోగతిని సమీక్షించింది. డిజిటల్ విద్యను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, విద్యార్థుల్లో కృత్రిమ మేధస్సు (AI) మరియు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. విద్యా రంగంలో లింగ వివక్షను రూపమాపి, అందరికీ సమగ్ర విద్యను అందించడమే అబుల్ కలాం ఆజాద్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని పలువురు విద్యావేత్తలు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande