
శ్రీనగర్, 18 నవంబర్ (హి.స.)
జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. నిషేధిత లష్కరే టాయిబా (LeT) ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ అగ్రనేత లతీఫ్ భట్‌ను భద్రతా బలగాలు స్థానిక మసీదులో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్‌లో భాగంగా చుట్టుముట్టాయి.
అయితే, భద్రతా బలగాలు లొంగిపోవాలని పదేపదే హెచ్చరించినప్పటికీ, ఉగ్రవాది లతీఫ్ భట్ మాత్రం లొంగిపోయేందుకు స్పష్టంగా నిరాకరించాడు. పవిత్ర ప్రార్థనా స్థలం (మసీదు) పవిత్రతను కాపాడేందుకు, అలాగే ప్రాణనష్టాన్ని నివారించేందుకు భద్రతా బలగాలు అత్యంత సంయమనం (Maximum Restraint) పాటిస్తున్నాయి. ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకునేందుకు లేదా లొంగిపోయేలా ఒప్పించేందుకు బలగాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi