
హైదరాబాద్ , 20 నవంబర్ (హి.స.)
ప్రపంచ ప్రముఖ ఆర్థిక, చెల్లింపుల సంస్థలైన వీసా, మాస్టర్‌కార్డ్, జేపీ మోర్గాన్ ఛేజ్ సంస్థలపై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అంతర్జాతీయ ఆర్థిక రంగంలో ఆందోళనకు దారితీసింది. ప్రముఖ సంస్థలే సైబర్ నేరగాళ్ల లక్ష్యంగా మారడంతో డిజిటల్ లావాదేవీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
ఈ దాడి నేపథ్యంలో ఆయా సంస్థలు స్పందించాయి. వినియోగదారులకు సంబంధించిన కొన్ని వివరాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, చెల్లింపులకు సంబంధించిన సమాచారం మాత్రం సురక్షితంగానే ఉందని వెల్లడించాయి. పేమెంట్స్ వ్యవస్థకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ సైబర్ దాడికి సంబంధించిన పరిణామాలు, ప్రభావితమైన వివరాలపై ఆసక్తి నెలకొంది. వినియోగదారుల సమాచార భద్రతకు సంబంధించి సంస్థలు తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న నేపథ్యంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్