తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి; ఒకసారికి మాత్రమే పరిమితం
తిరుప్పరంకుండ్రం కొండపై కార్తిక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతి; ఒకసారికి మాత్రమే పరిమితం
tirupparam


న్యూఢిల్లీ: , 20 నవంబర్ (హి.స.)

తిరుప్పరంకుండ్రం కొండపై నవంబర్ 24న కార్తిక దీపం వెలిగించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. అయితే ఇది కేవలం ఒకసారికి మాత్రమే వర్తించే ప్రత్యేక ఏర్పాటని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. దీపారాధన కోసం దేవస్థానం తరఫున అధీకృత వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు మాత్రమే వెళ్లాలని పేర్కొంది. అవసరమైతే దీపం వెలిగించే సమయంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు, తిరుప్పరంకుండ్రం కొండపై సంప్రదాయ కార్తిక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

దర్గా సమీపంలోని రాతి స్తంభంపై సంప్రదాయ కార్తిక దీపం వెలిగించేందుకు అనుమతిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సర్వే స్తంభాలకు మతపరమైన స్వభావం సంతరించుకునే ప్రమాదం ఉందని తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టులో వాదించింది.

మదురైలోని అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయానికి సంబంధించిన ఈ కార్తిక దీపం వివాదం, తిరుప్పరంకుండ్రం కొండపై దీపాన్ని ఎక్కడ, ఎవరు వెలిగించాలనే అంశం చుట్టూ తిరుగుతోంది. దశాబ్దాలుగా కొండ దిగువ వాలులోని ఉచ్చిపిళ్లైయార్ ఆలయానికి సమీపంలో ఉన్న దీప మండపంలో దీపాన్ని వెలిగిస్తున్నారు. దీనికి భిన్నంగా, హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో కొండ ఎగువన ఉన్న పురాతన రాతి దీప స్తంభమైన ‘దీపతూణ్’ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande