పసిడి ప్రియులకు ఊరట
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలపై తీవ్ర ఒత్తిడి పెరిగి, ఒక్కరోజే భారీగా దిగివచ్చాయి.
Gold rate


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలపై తీవ్ర ఒత్తిడి పెరిగి, ఒక్కరోజే భారీగా దిగివచ్చాయి. నవంబర్ 25, బుధవారం నాడు దేశీయ మార్కెట్లో 24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 322 తగ్గి రూ. 12,458 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా 22 క్యారట్ల గ్రాము ధర రూ. 295 తగ్గి రూ. 11,420 వద్ద ఉండగా, 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ. 241 తగ్గి రూ. 9,344 వద్ద కొనసాగుతోంది. 100 గ్రాముల చొప్పున చూస్తే 24 క్యారట్ల బంగారం రూ. 32,200 తగ్గి రూ. 12,45,800కు, 22 క్యారట్ల బంగారం రూ. 29,500 తగ్గి రూ. 11,42,000కు, 18 క్యారట్ల బంగారం రూ. 24,100 తగ్గి రూ. 9,34,400కు చేరుకుంది.తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో నేడు పసిడి ధరలు భారీగా తగ్గి ఒకే విధంగా నమోదయ్యాయి. ఈ మూడు నగరాల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 3,220 తగ్గి రూ. 1,24,580 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ. 2,950 తగ్గి రూ. 1,14,200 పలుకుతుండగా, 18 క్యారట్ల 10 గ్రాముల ధర రూ. 2,410 తగ్గి రూ. 93,440 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande