
ముంబై, 09 నవంబర్ (హి.స.)
దేశీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచి ప్రధాన సూచీలు నష్టాల్లోనే కదలాడుతున్నాయి. ఉదయం 9.45 గంటల సమయానికి సెన్సెక్స్ 206 పాయింట్లు కోల్పోయి 80,783 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు దిగజారి 24,917 స్థాయిలో కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్ వర్గాల్లో అప్రమత్తత నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, ముడిచమురు ధరలు, డాలర్ ఇండెక్స్, బాండ్ ఈల్డ్స్ వంటి అంశాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు. అమెరికా డాలర్ ఇండెక్స్ 101.69 వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 102.17 డాలర్ల వద్ద, అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 4.88 శాతం వద్ద ఉన్నాయి.
గత సెషన్లో అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.31 శాతం, నాస్డాక్ సూచీ 1.09 శాతం పెరిగాయి. అమెరికాలో లాభాలు నమోదైనప్పటికీ దేశీయ మార్కెట్లు మాత్రం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..