దేశీయ మార్కెట్లకు మళ్లీ జోష్
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. నవంబర్ మొదటి వారంలో చోటుచేసుకున్న అనూహ్య ర్యాలీ ఇన్వెస్టర్లలో నూతనోత్సాహాన్ని నింపింది.
స్టాక్ మార్కెట్


ముంబై, 06 నవంబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. నవంబర్ మొదటి వారంలో చోటుచేసుకున్న అనూహ్య ర్యాలీ ఇన్వెస్టర్లలో నూతనోత్సాహాన్ని నింపింది. ముఖ్యంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు మళ్లీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపడం సూచీలకు ప్రధాన బలంగా మారింది.

శుక్రవారం (నవంబర్ 6) గ్లోబల్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగినప్పటికీ, దేశీయ సూచీలు లాభాల బాటలోనే కొనసాగడం విశేషం. ముడిచమురు ధరలు దిగిరావడం, అమెరికాలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఎఫ్ఐఐలు తిరిగి భారత మార్కెట్లోకి అడుగుపెట్టడం ప్రస్తుత ర్యాలీకి ఊతమిస్తున్నాయి. అయితే, అమెరికా టెక్ షేర్లలో నమోదైన భారీ పతనం, ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాల ఒత్తిడి రాబోయే ట్రేడింగ్ సెషన్లపై ఆందోళన కలిగిస్తున్నాయి.

శుక్రవారం ముగింపు గణాంకాల ప్రకారం నిఫ్టీ 0.51 శాతం పెరిగి 24,662.80 వద్ద, సెన్సెక్స్ 0.76 శాతం లాభంతో 79,917.60 వద్ద స్థిరపడ్డాయి. దీంతో సెన్సెక్స్ 80 వేల కీలక మైలురాయికి చేరువైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande