లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి
Stock market


ముంబై, 25 నవంబర్ (హి.స.)

దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో దూసుకెళ్లాయి. గత సెషన్లలో ఒడిదొడుకులకు లోనైన సూచీలు నేడు ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచే కొనుగోళ్ల మద్దతుతో పుంజుకున్నాయి. ప్రారంభంలోనే కొనుగోళ్ల జోరు కనిపించడంతో మదుపర్లలో ఉత్సాహం నెలకొంది.

బుధవారం ఉదయం బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1,350 పాయింట్లు ఎగబాకి 83,786 వద్ద ట్రేడ్ అయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 384 పాయింట్లు లాభపడి 25,736 స్థాయికి చేరుకుంది. రెండు ప్రధాన సూచీలు భారీ లాభాల్లో కదలాడటంతో దేశీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మాత్రం మిశ్రమ సంకేతాలు వచ్చాయి. అమెరికా డాలర్ ఇండెక్స్ 103.88 స్థాయిలో కొనసాగగా, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ కు 90 డాలర్ల వద్ద ఉంది. అమెరికా పదేళ్ల బాండ్ల రాబడి 4.9 శాతానికి చేరుకుంది. గత సెషన్ లో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ 0.5 శాతం తగ్గగా, నాస్ డాక్ ఏకంగా 1.48 శాతం పడిపోయింది. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిసినా భారత సూచీలు భారీ లాభాలతో కొనసాగడం విశేషం.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande