మిస్ యూనివర్స్ 2026.. జెన్నిఫర్ బారెటో
75వ మిస్ యూనివర్స్ పోటీల్లో విశ్వసుందరి కిరీటం ప్యూర్టోరికోకే దక్కింది. ఆ దేశానికి చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.
Mis univers


హైదరాబాద్, 25 నవంబర్ (హి.స.)

75వ మిస్ యూనివర్స్ పోటీల్లో విశ్వసుందరి కిరీటం ప్యూర్టోరికోకే దక్కింది. ఆ దేశానికి చెందిన జెన్నిఫర్ బారెటో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.

ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ లో జరిగిన ఈ పోటీల్లో సొంతగడ్డపై జెన్నిఫర్ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విజయంతో ఆ దేశానికి ఇప్పటివరకు ఆరు విశ్వసుందరి కిరీటాలు దక్కినట్లైంది.

ఈ ఏడాది పోటీల్లో 116 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన మెలిస్సా నునెజ్ మొదటి రన్నరప్ గా నిలిచారు. వెనిజులాకు చెందిన కార్లా వేగాస్ రెండో రన్నరప్ గా నిలిచారు. భారత్ తరఫున కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో పోటీపడగా, ఆమె టాప్ 30లో చోటు సంపాదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande