
న్యూఢిల్లీ, 25 నవంబర్ (హి.స.)
అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. దీంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి తాత్కాలికంగా ఊరట లభించింది.
రాహుల్ ఆస్తులపై సీబీఐ, ఈడీ విచారణ జరపాలంటూ హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చింది. వాటిని సవాల్ చేస్తూ రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ను విచారించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అంతేకాదు, హైకోర్టులో ఆ కేసులో తదుపరి విచారణను కూడా నిలిపివేయాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రాహుల్కు తాత్కాలిక ఉపశమనం దక్కడంతో ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..