
న్యూఢిల్లీ, 26 నవంబర్ (హి.స.)
ఢిల్లీలో వాయు కాలుష్యం గురువారం ఉదయం కూడా రాజధాని ప్రజలు కాలుష్యపు గాలినే పీల్చాల్సి వచ్చింది.
ఉదయం 8 గంటల సమయానికి నగర వ్యాప్తంగా సగటున గాలి నాణ్యత సూచీ 228 వద్ద నిలిచింది. దీంతో మొత్తం నగరం పేలవమైన గాలి నాణ్యత కేటగిరీలోనే కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేసిన గణాంకాల ప్రకారం పలు ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.
ఆనంద్ విహార్ ప్రాంతంలో అత్యధికంగా 332 సూచీ నమోదైంది. నార్త్ క్యాంపస్ లో 302, ఐఐటీ ఢిల్లీ పరిసరాల్లో 241, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిసరాల్లో 230గా నమోదు కావడంతో ఆ ప్రాంతాల్లో గాలి చాలా ప్రమాదకర స్థాయిలో ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు లోధీ రోడ్డులో 148, ఇండియా గేట్, కర్తవ్య పథ్ ప్రాంతాల్లో 149 సూచీ నమోదై మోస్తరు స్థాయిలో ఉంది. ఎయిమ్స్ పరిసరాల్లో 188, మైదాన్ గఢిలో 199, ఓఖ్లా ఫేజ్ 2 లో 193, జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 190 సూచీ నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..