
ముంబై, నవంబర్ 26 (హి.స): నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ గురువారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. శరద్ పవార్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ధృవీకరించారు. విస్తృత పర్యటనలు, వరుస కార్యక్రమాల కారణంగా ఆయన డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) బారిన పడినట్లు వైద్యులు భావిస్తున్నారు. గురువారం జరిగిన జిల్లా విభాగాల అధ్యక్షుల సమావేశం మధ్యలోనే బయటకు వచ్చిన శరద్ పవార్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, నిరంతర ఛాతీ నొప్పి, దగ్గు కారణంగా ఆయన ఈ నెల ప్రారంభంలోనే రెండుసార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi