టేకులపల్లిలో పోలీసుల కార్డెన్ సెర్చ్
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా శనివారం ఉదయం టేకులపల్లి మండలంలోని గోలియాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ‘బి’ కాలనీ తండాలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
Police


భద్రాద్రి కొత్తగూడెం, 28 నవంబర్ (హి.స.)

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణే లక్ష్యంగా శనివారం ఉదయం టేకులపల్లి మండలంలోని గోలియాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ‘బి’ కాలనీ తండాలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది తండాలోని అన్ని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

వాహనాల తనిఖీల్లో భాగంగా 43 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక బొలెరో వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. సరైన వాహన ధ్రువీకరణ పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఆన్లైన్ మోసాల బారిన పడవద్దని తెలిపారు. గంజాయి, గుడుంబా వంటి మాదకద్రవ్యాలు, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఆన్లైన్ గేమింగ్ వల్ల కలిగే నష్టాలను గుర్తించాలని ప్రజలకు వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande