
హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)
డిసెంబర్ 7 నుండి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ లో రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి పది జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
సమావేశాల లక్ష్యం:
ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక అధికారులు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ ప్రధాన లక్ష్యాలు, రాష్ట్రానికి ఉన్న పెట్టుబడి అవకాశాలు, సదస్సు ద్వారా ఆశిస్తున్న ఫలితాలు, ప్రదర్శనలు, వివిధ రంగాల కార్యక్రమాల వివరాలను ప్రజాప్రతినిధులకు వివరించి, వారిని సదస్సుకు అధికారికంగా ఆహ్వానించనున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులు, స్పెషల్ ఆఫీసర్ల జాబితా:
హైదరాబాద్: పొన్నం ప్రభాకర్ (మంత్రి), జయేశ్ రంజన్ (స్పెషల్ ఆఫీసర్)
రంగారెడ్డి: దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంత్రి), వికాస్‌రాజ్ (స్పెషల్ ఆఫీసర్)
కరీంనగర్: తుమ్మల నాగేశ్వరరావు (మంత్రి), బెన్హర్ మహేశ్ దత్ ఎక్కా (స్పెషల్ ఆఫీసర్)
మెదక్: వివేక్ వెంకటస్వామి (మంత్రి), లోకేశ్‌కుమార్ (స్పెషల్ ఆఫీసర్)
నిజామాబాద్: సీతక్క (మంత్రి), యోగితా రాణా (స్పెషల్ ఆఫీసర్)
నల్గొండ: అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (మంత్రి), హరిచందన దాసరి (స్పెషల్ ఆఫీసర్)
ఆదిలాబాద్: జూపల్లి కృష్ణారావు (మంత్రి), ఇలంబర్తి (స్పెషల్ ఆఫీసర్)
వరంగల్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (మంత్రి), కృష్ణ ఆదిత్య (స్పెషల్ ఆఫీసర్)
మహబూబ్‌నగర్: దామోదర రాజనర్సింహ (మంత్రి), గౌతమ్ (స్పెషల్ ఆఫీసర్)
ఖమ్మం: వాకిటి శ్రీహరి (మంత్రి), అనుదీప్ దురిశెట్టి (స్పెషల్ ఆఫీసర్)
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్