ఆసిఫాబాద్ — అధిక వడ్డీ, అక్రమ చిట్టీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల మెరుపు దాడులు
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీల నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
ఆసిఫాబాద్ — అధిక వడ్డీ, అక్రమ చిట్టీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల మెరుపు దాడులు


కుమురం భీం ఆసిఫాబాద్, 28 నవంబర్ (హి.స.)

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారులు, అక్రమ చిట్టీల నిర్వాహకులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ బి. అశోక్, కాగజ్నగర్ డీఎస్పీ వాహిదుద్దీన్ పర్యవేక్షణలో పోలీసు బృందాలు జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో 57 మంది వ్యాపారుల ఇళ్లలో సోదాలు నిర్వహించాయి. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, చిట్టీ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.

స్వాధీనం చేసుకున్న పత్రాలు — కేసులు

ఈ తనిఖీలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 16 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. సోదాల్లో 102 ప్రామిసరీ నోట్లు, 63 ఖాళీ చెక్బుక్లతో పాటు ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మితిమీరిన వడ్డీలు వసూలు చేస్తూ, చట్టవిరుద్ధంగా చిట్టీలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బాధితులు ఎటువంటి భయం లేకుండా సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande