
హైదరాబాద్ , 28 నవంబర్ (హి.స.)
డీలిమిటేషన్ అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీలిమిటేషన్ బిల్లుపై పార్టీ అనుసరిస్తున్న వైఖరిని నేతలకు వివరించారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి నష్టం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు.
డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి అందుబాటులో ఉన్న అంశాలను పార్టీ నాయకులతో చర్చించిన కేటీఆర్.. ఈ విషయంలో బీఆర్ఎస్ వైఖరి ఏమిటనే దానిపై స్పష్టత ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణాది ప్రాంతాలకు అన్యాయం జరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం లేదని పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఈ కారణంగానే డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటిస్తోందని కేటీఆర్ పార్టీ నేతలకు తెలిపారు. పార్లమెంట్లో ఈ అంశంపై పార్టీ అనుసరించాల్సిన వైఖరి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. డీలిమిటేషన్‌పై పార్టీ వైఖరిని క్షేత్రస్థాయిలోనూ ప్రజలకు వివరించాలని సూచించినట్లు సమాచారం. తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఈ అంశంపై పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్