శబ్ద కాలుష్యంపై పోలీసుల ఉక్కుపాదం
తీవ్రమైన శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న 270 మోడిఫైడ్ సైలెన్సర్లను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సమక్షంలో రోడ్డు రోలర్తో తొక్కించి వాటిని పూర్తిగా నాశనం చేశారు.
Police

కరీంనగర్, 28(హి.స)

వాహన తనిఖీల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను అమర్చుకున్న వాహనదారుల నుంచి ట్రాఫిక్ పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. ప్రజలు ఎవరైనా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వాట్సాప్ నంబర్ 9381919112కు పంపవచ్చని పోలీసులు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..

 rajesh pande