
రంగారెడ్డి , 28 నవంబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో రాష్ట్ర ఆయిల్పామ్ రైతు సంఘాల అధ్యక్షులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్పామ్ సాగుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట సాగులో ఎదురవుతున్న ఇబ్బందులపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. రైతుల నుంచి అభిప్రాయాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం ఆయిల్పామ్ సాగుపై చూపే పరిణామాలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడితే పంట దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశాన్ని పరిశీలించారు. ఈ నేపథ్యంలో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఆయిల్పామ్ సాగును మరింత ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఎదురవుతున్న సమస్యలకు పరిష్కార మార్గాలు కనుగొనడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. రైతు సంఘాల అధ్యక్షులు తమ క్షేత్రస్థాయి అనుభవాలను, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్