
సిద్దిపేట, 28 నవంబర్ (హి.స.)
నేడు బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న నాలుగు కిరాణా దుకాణాల్లో మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చేశారు. కార్డన్ సెర్చ్‌లో పోలీసు ఉన్నతాధికారులు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిపి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..
శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మాదకద్రవ్యాల వినియోగం యువత జీవితాలను నాశనం చేయడంతో పాటు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుందని ఆయన హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికను నిరంతరం గమనించాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు