
వికారాబాద్, 28 నవంబర్ (హి.స.)
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన కూడళ్లు, రహదారులు, రద్దీ ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నేర నియంత్రణకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్లను నిరంతరం కొనసాగించాలని సూచించారు.
ఆమె ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజల భద్రతను మరింత పటిష్టం చేసే లక్ష్యంతో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.
ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు భారీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు.
ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 1,019 వాహనాలను తనిఖీ చేయగా, 206 ఈ-పెట్టి కేసులు, 56 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 294 ఈ-చలాన్లు విధించి, మొత్తం రూ.1,28,516 జరిమానా విధించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు