పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు! సీపీ సజ్జనార్ హెచ్చరిక
తెలంగాణ, 14 ఫిబ్రవరి (హి.స.) సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడతో అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో ''డిజిటల్ అరెస్ట్'' (Digital Arrest) పేరుతో సాగుతున్న నయా మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలను
Sajjanar


తెలంగాణ, 14 ఫిబ్రవరి (హి.స.)

సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త

ఎత్తుగడతో అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో 'డిజిటల్ అరెస్ట్' (Digital Arrest) పేరుతో సాగుతున్న నయా మోసాలపై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ప్రజలను అప్రమత్తం చేశారు. శనివారం ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతా ద్వారా ఒక వీడియోను షేర్ చేస్తూ.. పోలీస్ వేషధారణలో వచ్చే వీడియో కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

పోలీస్ వేషం.. పక్కా మోసం

సైబర్ నేరగాళ్లు పోలీస్ స్టేషన్ సెటప్ వేసి, పోలీసు యూనిఫాం ధరించి వీడియో కాల్స్ చేస్తున్నారని, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు దండుకుంటున్నారని సీపీ తెలిపారు. ఈ తరహా మోసాలను వివరిస్తూ.. 'పోలీస్ వేషం చూసి మోసపోకు.. వీడియో కాల్ నమ్మి మునిగిపోకు' అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ పలు కీలక విషయాలను స్పష్టం చేశారు. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ (WhatsApp) లేదా స్కైప్ వంటి వీడియో కాల్స్ ద్వారా నిందితులను విచారించరు. విచారణ పేరుతో పోలీసులు ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయరు.. అసలు భారత చట్టాల్లో 'డిజిటల్ అరెస్ట్' అనే పదమే లేదని, దీనికి చట్టబద్ధత లేదని ఆయన తేల్చి చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande