హైదరాబాద్ జంట జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ
హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.
High court


హైదరాబాద్, 23 ఫిబ్రవరి (హి.స.)హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి.. నీళ్లు కలుషితమవుతున్నాయంటూ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. తాగునీటి జలాశయాల్లో వ్యర్థాలు చేరడంపై ఉన్నత న్యాయస్థానం జలమండలిని ప్రశ్నించింది. జలమండలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీని ప్రతివాదులుగా చేర్చింది. జంట జలాశయాల నిర్వహణపై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande