అభివృద్ధి వైపే.. మంథని పట్టణ ప్రజలు.. మంత్రి దుద్దిల్ల
పెద్దపల్లి14 ఫిబ్రవరి (హి.స.) మంథని పట్టణ ప్రజలు అభివృద్ధి వైపే ఉన్నట్లు మున్సిపల్ ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే స్పష్టం అయ్యాయి. అందులో మంథని మున్సిపాలిటీలో 13 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. దీంతో మంథని మున్సిపల్
మంత్రి దుద్దిల్ల


పెద్దపల్లి14 ఫిబ్రవరి (హి.స.) మంథని పట్టణ ప్రజలు అభివృద్ధి వైపే

ఉన్నట్లు మున్సిపల్ ఎన్నికల్లో వెలువడ్డ ఫలితాలే స్పష్టం అయ్యాయి. అందులో మంథని మున్సిపాలిటీలో 13 వార్డులకు 11 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి సత్తా చాటారు. దీంతో మంథని మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు తన నియోజకవర్గంలో మంథని కేంద్రంగా ఉన్న మంథని మున్సిపల్ ఎన్నికల్లో 11 స్థానాల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ లు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న శ్రీధర్ బాబు ఓ పక్క... రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం మరో పక్కా.. మంథని నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే మంథని పట్టణ అభివృద్ధికి మంత్రి శ్రీధర్ బాబు కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేశారు. ఓ వైపు మంత్రి శ్రీధర్ బాబు తనకు ఇన్ చార్జిగా ఇచ్చిన జిల్లాలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే.. మంథని మున్సిపాలిటీ లో కుడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీధర్ బాబు సోదరుడు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు తనదైన శైలిలో మంథని మున్సిపాలిటీ లో ఎన్నికల ప్రచారం నిర్వహించి అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రీను బాబు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కీలకం అయ్యాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande